తెలుగు తెరకి మరో నటవారసుడు!
Add ap7am to your home Screen

తెలుగు తెరకి మరో నటవారసుడు!

  • నటుడిగా శివాజీరాజాకి మంచి పేరు
  •  'మా' అధ్యక్షుడిగా బిజీ 
  • హీరోగా ఆయన తనయుడు రంగంలోకి  
ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన నటుడిగా శివాజీరాజాకి మంచి పేరుంది. కామెడీ టచ్ వున్న పాత్రలను మాత్రమే కాదు .. ఎమోషన్ తో కూడిన పాత్రలను సైతం అద్భుతంగా పోషించారు. అలాంటి శివాజీరాజా ప్రస్తుతం 'మా' అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వున్న ఆయన, తన తనయుడు విజయ్ రాజాను కూడా ఇదే మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు.

 అలా విజయ్ రాజా హీరోగా ఒక సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నూతన దర్శకుడు రమాకాంత్ రూపొందించే ఈ సినిమాకి 'ఏదైనా జరగొచ్చు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'బిగ్ బాస్ 2' షోకి సంబంధించిన ప్రోమోల ద్వారా 'ఏదైనా జరగొచ్చు' అనే మాట బాగా పాప్యులర్ అయింది. ఈ టైటిల్ ను బట్టి ఇది థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. దర్శకుడు .. హీరో ఇద్దరూ కొత్తవారే అయిన ఈ సినిమాకి హీరోయిన్ ను ఇంకా సెట్ చేయలేదు .. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.     
sivaji raja
vijay raja

More Telugu News