చంద్రబాబు అందుకే విదేశాలకు వెళుతున్నారు: ఎమ్మెల్యే రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు అందుకే విదేశాలకు వెళుతున్నారు: ఎమ్మెల్యే రోజా

  • చంద్రబాబు నాయుడిది దోచుకొని, దాచుకునే నైజం
  • దోచుకున్న డబ్బుని విదేశాల్లో దాచి వస్తున్నారు
  • నాలుగేళ్లు బీజేపీతో మిత్రత్వం కొనసాగించారు
  • అఫిడవిట్‌ విషయంలో సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే ఏం చెబుతారు?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దోచుకొని, దాచుకునే నైజమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజు విజయవాడలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు దోచుకున్న డబ్బుని విదేశీ పర్యటనల పేరుతో వెళ్లి అక్కడ దాచి వస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు మీడియా ముందుకొచ్చి దారుణంగా మాట్లాడుతున్నారని, తమ పార్టీ అధినేత జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

నాలుగేళ్లు బీజేపీతో మిత్రత్వం కొనసాగించిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల అంశంపై సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్‌ విషయంలో న్యాయస్థానం.. నాలుగేళ్ల బీజేపీ, టీడీపీ మిత్రత్వంపై ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని రాష్ట్ర మంత్రులని ఆమె ప్రశ్నించారు. 
YSRCP
roja
Telugudesam

More Telugu News