స్నేహితురాలి తండ్రే ఆ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్నేహితురాలి తండ్రే ఆ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు!

  • గురుగ్రామ్ లో ఘటన
  • పబ్ కు తీసుకెళ్లి మద్యం తాగించిన వ్యాపారి
  • తెల్లవారుజామున అత్యాచారం 
తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఇంట్లో.. అంకుల్ అంటూ పిలుస్తూ తన తండ్రి వయసున్న వ్యక్తి నీడన సురక్షితంగా ఉన్నానని భావించిందా యువతి. స్నేహితురాలి ఇంట్లో వుండి న్యాయ విద్య అభ్యసిస్తున్న యువతిపై, స్నేహితురాలి తండ్రి అత్యాచారం చేశాడు. పక్క గదిలో కుమార్తె నిద్రిస్తోందన్న సంగతిని కూడా మరచిపోయిన ఆ కామాంధుడు కన్న కూతురి వంటి అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో జరిగింది.

పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఇండియా, కెనడాల్లో డెంటల్ ఇంప్లాంట్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి సుహానా రోడ్ లో నివసిస్తున్నాడు. అతని కుమార్తెకు ఆ దగ్గరలో ఉండే బాధితురాలు ఎనిమిదో తరగతి నుంచి స్నేహితురాలు. ఆమె తరచూ వ్యాపారి ఇంటికి వచ్చేది. ఈ నేపథ్యంలో, గురువారం రాత్రి తన కుమార్తె, బాధితురాలితో కలసి సైబర్ హబ్ కు డిన్నర్ కు వెళ్లాడు. తన కుమార్తెతో పాటు, బాధితురాలితో మద్యం తాగించాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముగ్గురూ ఇల్లు చేరారు.

తన స్నేహితురాలి గదిలో బాధితురాలు నిద్రిస్తుండగా, అతను వచ్చి లేపి, చేతులు గట్టిగా పట్టుకుని, పక్క గదిలోకి తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తెల్లారిన తరువాత, తన స్నేహితురాలికి విషయం చెప్పి, ఆమె సాయంతో ఇంటికి చేరిన ఆమె, తల్లితో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా, బాధితురాలే స్వయంగా తన గదికి వచ్చిందని, తాను ఎలాంటి బలవంతం చేయలేదని సదరు కామాందుడు కోర్టు ముందు పేర్కొనడం గమనార్హం. అతని భార్య కూడా అతనికే వత్తాసు పలుకుతోంది. తమ కుటుంబ పరువు తీసేందుకు ఈ పని చేస్తున్నారని వాపోయింది. న్యాయ విద్యార్థిని తండ్రి కూడా తన భర్త చేస్తున్న వ్యాపారమే చేస్తున్నాడని, ఆయనకు పోటీగా వస్తున్నందుకు కుమార్తెతో ఈ ఆరోపణలు చేయించాడని ఆరోపించింది.
Rape
New Delhi
Gurugram
Law Student

More Telugu News