11న వైసీపీలో చేరనున్నాను: మాజీ మంత్రి మహీధర్ రెడ్డి
- టీడీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం
- కార్యకర్తల అభీష్టం మేరకు వైకాపాలో చేరాలని నిర్ణయం
- తిరుపతిలో మీడియాతో మహీధర్ రెడ్డి
తిరుపతి తీర్థకట్ట వీధిలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన ఆయన, సాయి ఆశీస్సులు తనకు ఉన్నాయని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నానని అన్నారు. నిత్యమూ ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తీర్చే ప్రయత్నం చేసే మహీధర్ రెడ్డి, వైకాపాలో చేరడం సంతోషంగా ఉందని విజయసాయి వ్యాఖ్యానించారు.