హత్య కేసు నిందితుడిని బాల్కనీ నుంచి కిందికి తోసేసిన జనం!

  • బీహార్‌లో మరో దారుణం
  • హత్య కేసు నిందితుడిని చంపే యత్నం
  • ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య నిందితుడు
బీహార్‌లో మరో దారుణం జరిగింది. హత్య కేసు నిందితుడిని అందరూ కలిసి బిల్డింగ్ బాల్కనీ నుంచి కిందికి తోసి చంపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడికి, జనాలకు మధ్య పెనుగులాట జరిగింది. చివరికి అతడిని గట్టిగా పట్టుకున్న కొందరు బిల్డింగ్ పై నుంచి కిందికి తోసేశారు.

తీవ్ర గాయాలపాలైన నిందితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హత్య చేసిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో రెచ్చిపోయిన స్థానికులు ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. నలందా జిల్లాలోని బీహార్ షరీఫ్‌లో జరిగిందీ ఘటన. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Bihar
Nalanda
Murder
accused

More Telugu News