తమ సంస్థ డీన్‌ వాసుబాబుపై సస్పెన్షన్‌ వేటు వేసిన శ్రీ చైతన్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమ సంస్థ డీన్‌ వాసుబాబుపై సస్పెన్షన్‌ వేటు వేసిన శ్రీ చైతన్య

  • ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసు
  • నిన్న వాసుబాబు అరెస్ట్‌
  • తమకు ఎటువంటి సంబంధమూ లేదన్న శ్రీ చైతన్య
తెలంగాణలో 2016లో దుమారం రేపిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిన్న సీఐడీ మరో ఇద్దరు నిందితులని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శ్రీచైతన్య కళాశాల డీన్‌ వాసు బాబుతో పాటు నారాయణ, శ్రీచైతన్య సంస్థల ఏజెంట్ క‌మ్మ వెంక‌ట శివ‌నారాయ‌ణ‌ని అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ విషయంపై స్పందించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల తెలంగాణ కో ఆర్డినేటర్‌ నరేంద్ర బాబు... శ్రీచైతన్య డీన్‌ వాసుబాబును అరెస్టు చేయడం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయనను సస్పెండ్‌ చేశామని అన్నారు. 32 ఏళ్ల తమ విద్యా సంస్థ ప్రస్థానంలో తామెన్నడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని చెప్పారు. తాజాగా జరిగిన ఈ పరిణామంతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు. 
vasu babu
Hyderabad
Police

More Telugu News