పవన్ ఫ్యాన్స్ పై మరోసారి విరుచుకుపడ్డ రేణు దేశాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ ఫ్యాన్స్ పై మరోసారి విరుచుకుపడ్డ రేణు దేశాయ్!

  • నా తప్పు లేకున్నా ఐదేళ్లుగా నిందలు పడుతున్నా
  • నా ఆత్మాభిమానం గురించి ఎవరైనా ఆలోచించారా?
  • పవన్ ఇమేజ్ కు భంగం కలిగితే.. నేను సరిచేయాలా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా రేణు దేశాయ్ పేరుతో ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది. దీనిపై రేణు స్పందించారు. ఒక స్టుపిడ్ పొలిటికల్ పర్సన్ దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపింది. దీని గురించి కొందరు సభ్యత లేకుండా, మరికొందరు భయపెడుతూ కామెంట్లు పెడుతున్నారని వాపోయారు. కొందరేమో ఆ మాటలు తప్పు అని చెప్పాలంటూ అడుగుతున్నారని తెలిపింది. గత ఐదేళ్లుగా తన తప్పు లేకుండానే నిందలు పడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆత్మాభిమానం గురించి ఎవరైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.

అన్నీ మర్చిపోయి సైలెంట్ గా ఉండాలంటూ గత ఐదేళ్లుగా తనకు సూచిస్తున్నారని రేణు అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఏదైనా మాట్లాడితే, మౌనంగా భరించు అంటూ సలహా ఇస్తున్నారని చెప్పారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం తాను వ్యాఖ్యలు చేస్తున్నానంటూ మరికొందరు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ గారి ఇమేజ్ కి భంగం వాటిల్లితే, నేను వచ్చి సరిచేయాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి సమాజంలో జీవిస్తున్నందుకు బాధపడుతున్నానని చెప్పారు. ఏదో ఒక రోజు తనకు ప్రశాంతత కలుగుతుందని భావిస్తున్నానని తెలిపారు. పవన్ గురించి తాను ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడనని చెప్పారు. 
Pawan Kalyan
relu desai

More Telugu News