సీఎం చంద్రబాబు రైతు ద్రోహి: ఎమ్మెల్యే రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం చంద్రబాబు రైతు ద్రోహి: ఎమ్మెల్యే రోజా

  • చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతులను నట్టేట ముంచారు 
  • మొన్న టొమాటో రైతులు, ఇప్పుడు మామిడి రైతులు  
  • రైతులపై చంద్రబాబుది దొంగప్రేమ  
సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రైతు ద్రోహి అని, ఆయన సొంత జిల్లాలోనే రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. మొన్న టొమాటో రైతులు, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డున పడ్డారని అన్నారు. మామిడి కాయలను రోడ్డుపై వేసి రైతులు తమ నిరసన తెలిపారని, ఈ సంఘటన చంద్రబాబు సర్కార్ కు సిగ్గుచేటని విమర్శించారు. రైతులపై చంద్రబాబు దొంగప్రేమ చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  
Chandrababu
ROJA

More Telugu News