అపార ప్రాణ నష్టాన్ని నిలువరించిన లోకో పైలట్.. బ్రేక్ వేయడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే..!
- ప్రమాదాన్ని ముందే శంకించిన లోకోపైలట్
- ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో తప్పిన పెను ప్రమాదం
- అభినందించిన కేంద్ర మంత్రి
- రూ.5 లక్షల బహుమానం
ఈ ఘటనపై సావంత్ మాట్లాడుతూ.. బ్రిడ్జిలోని ఓ భాగం కూలిపోవడాన్ని తాను గమనించానని, రైలు కనుక మరికొంత ముందుకు వెళితే ప్రమాదమని భావించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించానని వివరించాడు. తమ ప్రాణాలు కాపాడిన సావంత్‌కు ప్రయాణికులు అభినందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విషయం తెలిసి సావంత్‌ను మెచ్చుకున్నారు. అతడి సమయస్ఫూర్తికి అభినందనలు తెలిపారు. అంతేకాదు, రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.