అక్రమ నిర్మాణంపై ప్రియాంకాచోప్రాకు మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు!
- ముంబైలోని అంధేరీ ప్రాంతంలో వాణిజ్య సముదాయం
- అనుమతించిన ప్లాన్ ప్రకారం జరగని నిర్మాణాలు
- ప్రియాంకకు రెండు నోటీసులు జారీ చేసిన బృహన్ ముంబై
జూన్ 2013లో తాము మంజూరు చేసిన ప్రణాళిక ప్రకారం కాకుండా, అక్రమంగా నిర్మాణాలు సాగించిన మాట వాస్తవమేనని గుర్తించిన అధికారులు, రెండు నోటీసులను ఆమెకు జారీ చేశారు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న అక్రమ నిర్మాణాన్ని తొలగించకుంటే, తామే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. కాగా, వాస్తు కోసమే తాము కొన్ని మార్పులు చేశామే తప్ప, ఎలాంటి అక్రమ నిర్మాణాలనూ చేపట్టలేదని ప్రియాంకా చోప్రా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.