కృష్ణా జిల్లాలో ఘోరం... ప్రేమలో పడిందన్న అనుమానంతో కుమార్తెను కొట్టి చంపిన తండ్రి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణా జిల్లాలో ఘోరం... ప్రేమలో పడిందన్న అనుమానంతో కుమార్తెను కొట్టి చంపిన తండ్రి!

  • పెంచి పెద్ద చేసిన కుమార్తెపై దారుణం
  • పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే పరలోకాలకు
  • ఫోన్ లో మాట్లాడుతుంటే అనుమానంతో దాడి
తన కుమార్తె ప్రేమలో పడిందన్న ఆగ్రహం, ఆ తండ్రిని కర్కోటకుడిగా మార్చింది. 22 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన కుమార్తె, తన పరువు తీయనుందన్న క్షణికావేశం అతన్ని హంతకుడిగా మార్చింది. శుక్రవారం నాడు పుట్టినరోజు వేడుక జరుపుకున్న కూతురిని తన స్వహస్తాలతో కొట్టి చంపాడో తండ్రి. కృష్ణా జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన తొండెపు కోటయ్య, పద్మావతి దంపతుల పెద్ద కుమార్తె చంద్రిక. ఆమె వయసు 22 సంవత్సరాలు. గుడ్లవల్లేరులోని ఓ కళాశాలలో బీ ఫార్మసీ పూర్తి చేసి, ఉన్నత విద్యకు సిద్ధమవుతోంది. శుక్రవారం బర్త్ డే వేడుకల తరువాత, శనివారం నాడు, చంద్రిక సెల్‌ ఫోన్‌ లో ఎవరితోనో మాట్లాడుతూ తండ్రికి కనిపించింది.

ఆమె తన ప్రియుడితో మాట్లాడుతోందని ఆగ్రహించిన కోటయ్య, ఓ కర్ర తీసుకుని గట్టిగా కొట్టడంతో, తీవ్ర రక్తస్రావమై, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన కళ్ల ముందే కుమార్తె మరణించడంతో పద్మావతి స్పృహ కోల్పోయింది. చంద్రిక చనిపోయిందని తెలుసుకున్న తండ్రి ఇంట్లో నుంచి పారిపోగా, పద్మావతి తండ్రి పారా రామారావు జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోటయ్య ఆవేశంలో కోట్టడంతోనే చంద్రిక మృతి చెందిందని రామారావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Krishna District
Lover
Died
Chandrika
Phone
Birthday

More Telugu News