పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకున్నారా..? నేటితో గడువు పూర్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకున్నారా..? నేటితో గడువు పూర్తి

  • 2018 జూన్ 30 వరకు గడువు ఇచ్చిన కేంద్రం
  • ఆదాయపన్ను రిటర్నులకు అనుసంధానం తప్పనిసరి
  • మరోసారి గడువు పొడిగింపు ఉంటుందా అన్నదానిపై నేడు స్పష్టత
పాన్ ను ఆధార్ నంబర్ తో అనుసంధానించుకున్నారా? లేదంటే ఆ అనుసంధానానికి ఇచ్చిన గడువు నేటితో ముగిసిపోతోంది. ఈ రెండింటి అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 2018 జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. నిజానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి నాలుగు సార్లు పొడిగించింది. ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే అందుకు పాన్ ను ఆధార్ తో అనుసంధానించి ఉండాలి. అయితే, మరోసారి గడువు పొడిగింపు ఉంటుందా అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్ సైట్ కు వెళ్లి పై భాగంలో కనిపించే లింక్ ఆధార్ ను ఎంచుకోవాలి. తర్వాత పేజీలో పాన్ నంబర్, ఆధార్ నంబర్ పేర్కొని ‘లింక్ ఆధార్’ ను క్లిక్ చేయాలి. 
adhaar
pan
linking

More Telugu News