నాపై హత్యకు కుట్ర పన్నే వారిని లెక్కచేయను: నటుడు ప్రకాష్ రాజ్
Add ap7am to your home Screen

నాపై హత్యకు కుట్ర పన్నే వారిని లెక్కచేయను: నటుడు ప్రకాష్ రాజ్

  • ఇలాంటి వారిని చూసి నాకు ఎలాంటి భయం లేదు
  • విద్వేషపూరిత రాజకీయాలు నన్నేమీ చేయలేవు
  • ఎప్పటికీ నాదే అదే మాట
నటుడు ప్రకాష్ రాజ్ ను అంతమొందించేందుకు కుట్ర జరిగినట్టు కర్ణాటక సిట్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన సంఘటనపై ఆయన మరోసారి స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, ‘నాపై హత్యకు కుట్ర పన్నే వారిని నేను లెక్క చేయను. ఇలాంటి వాళ్లతో నాకు ఎలాంటి భయం లేదు.. ఈ బెదిరింపులకు భయపడను. విద్వేషపూరిత రాజకీయాలు నన్నేమీ చేయలేవు. ఎప్పటికీ నాదే అదే మాట’ అని స్పష్టం చేశారు.

ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు పాల్పడిన నిందితులను సిట్ అధికారులు విచారించిన సమయంలో తన హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగు చూసిందని ప్రకాష్ రాజ్ చెప్పారు.
Prakash Raj
Tollywood

More Telugu News