నా పెళ్లి గురించి మీకెందుకయ్యా... అంటున్న నిహారిక.. వెరైటీగా 'హ్యాపీ వెడ్డింగ్' ప్రమోషనల్ వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా పెళ్లి గురించి మీకెందుకయ్యా... అంటున్న నిహారిక.. వెరైటీగా 'హ్యాపీ వెడ్డింగ్' ప్రమోషనల్ వీడియో

  • నిహారిక కథానాయికగా 'హ్యాపీ వెడ్డింగ్'
  • దర్శకుడిగా లక్ష్మణ్ కార్య 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
యూత్ లో నిహారికకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. వాళ్లంతా కూడా ఆమె నుంచి రానున్న సినిమా కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్' రూపొందింది. సుమంత్ అశ్విన్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను కొత్త కాన్సెప్ట్ తో రిలీజ్ చేశారు.

 షూటింగ్ ముగించుకుని బయల్దేరుతోన్న నిహారిక దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. తాను ఓ యూ ట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినట్టు చెప్పి .. 'సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ విషయం బాగా వైరల్ అవుతోంది .. దాని గురించి చెబుతారా?' అని అడుగుతాడు. దాంతో .. "నా పెళ్లి గురించి మీకెందుకయ్యా .. ఎవరిని చేసుకుంటుంది .. ఎప్పుడు చేసుకుంటుంది .. చూస్తే షాక్ అవుతారు .. షేక్ అవుతారు అంటూ రాస్తారు. మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా?" అంటూ కోపాన్ని ప్రదర్శిస్తుంది. తాను అడిగేది 'హ్యాపీ వెడ్డింగ్' మూవీ గురించి అని ఆ వ్యక్తి అనడంతో వెంటనే శాంతిస్తూ .. "సారీ .. సారీ .. 'హ్యాపీ వెడ్డింగ్' ట్రైలర్ ఈ నెల 30 వ తేదీన రిలీజ్ అవుతుంది .. ఆ రోజునే సినిమా రిలీజ్ ఎప్పుడనేది చెబుతాను .. బై' అంటూ వెళ్లి పోతుంది'. ఆ రోజున ఉదయం 10 గంటల 35 నిమిషాలకి ఈ సినిమా ట్రైలర్ ను వదలనున్నారు.
niharika
sumanth aswin

More Telugu News