ఇంట్లోకి వెళ్తున్న బాలుడిని నోట కరుచుకుని వెళ్లిన చిరుత!
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘటన
- మనుషుల రక్తం రుచిమరిగిన చిరుత
- ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులను పొట్టనపెట్టుకున్న వైనం
అనంతరం అతని తల్లిదండ్రులు, బంధువులతో పాటు గ్రామస్తులు అడవిలో గాలించగా... చిన్నారి మృతదేహం కనిపించింది. బాగేశ్వర్ జిల్లాలో ఇటీవలే ఓ ఏడేళ్ల బాలుడిని, మార్చి నెలలో నాలుగేళ్ల మరో బాలుడిని కూడా చిరుత పొట్టనపెట్టుకుంది. దీంతో, మనుషుల రక్తం తాగేందుకు అలవాటు పడ్డ చిరుతను చంపేయాలంటూ అటవీ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.