రెండు పార్టులుగా బాలయ్య 'ఎన్టీఆర్' బయోపిక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు పార్టులుగా బాలయ్య 'ఎన్టీఆర్' బయోపిక్!

  • ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ చిత్రం
  • రెండు భాగాలుగా తీద్దామని భావిస్తున్న క్రిష్
  • బాలయ్యతో క్రిష్ చర్చలు
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'ఎన్టీఆర్' పై మరో ఆసక్తికరమైన వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మూడు గంటల సినిమాగా చూపించడం చాలా కష్టమని భావిస్తున్న దర్శకుడు క్రిష్, రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

ఒక భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, మరో భాగంలో రాజకీయ ప్రయాణాన్ని చూపాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు బాలకృష్ణతో తమ మనసులోని విషయాన్ని క్రిష్ చర్చించారని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. కాగా, ఈ సినిమాకు తొలుత తేజను డైరెక్టర్ గా తీసుకున్న బాలయ్య, ఆ తరువాత ఆయన్ను తప్పించిన సంగతి తెలిసిందే.
Balakrishna
NTR
Biopic
Krish

More Telugu News