ఒకే బైక్పై అమ్మాయి, అబ్బాయి ఎందుకు వెళుతున్నారంటూ దాడి.. వీడియో వైరల్!
- అస్సాంలో ఘటన
- గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కొట్టిన వైనం
- ఇద్దరి అరెస్ట్
ఈ ఘటనపై తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపడుతున్నారని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాడికి గురైన యువకుడి సోదరుడు మీడియాతో మాట్లాడాడు. బైక్పై అమ్మాయి, అబ్బాయి వెళ్లడం ఏంటంటూ దూషణలకు దిగారని అన్నాడు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపాడు.