ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ కు అమెరికా రాంరాం!
- కౌన్సిల్ నుంచి తప్పుకున్న యూఎస్ఏ
- ఇజ్రాయిల్ విషయంలో ద్వంద్వ వైఖరి
- ఐరాస వైఖరిపై నిక్కీ హేలీ విమర్శలు
ఇక, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి తప్పుకున్న తరువాత నిక్కీ హేలీ స్పందిస్తూ, "మానవ హక్కులను కాలరాస్తున్నవారికి ఈ కౌన్సిల్ రక్షణగా నిలుస్తోంది. కౌన్సిల్ మొత్తం రాజకీయాలతో నిండిపోయింది. సామూహిక హత్యలు, హింసాకాండ అత్యధికంగా జరిగే కాంగోను కౌన్సిల్ లోకి ఎందుకు తీసుకున్నారు? వెనిజులా, ఇరాన్ లో మానవ హక్కులను కాలరాస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు?" అని వ్యాఖ్యానించారు. మైక్ పాంపియోతో కలసి మీడియాతో మాట్లాడిన ఆమె, హక్కులను కాపాడలేకపోతున్న కౌన్సిల్ లో తాము కొనసాగాల్సిన అవసరం లేదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.