నేను మహేశ్ ను నొప్పించానేమో .. అడుగుదామంటే కుదరలేదు!: మణిశర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను మహేశ్ ను నొప్పించానేమో .. అడుగుదామంటే కుదరలేదు!: మణిశర్మ

  • మహేశ్ సినిమాలకి పని చేశాను 
  • మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది 
  • ఎక్కడో చిన్న డిస్టర్ బెన్స్ వచ్చింది  
తెలుగులో అగ్రహీరోల సినిమాలకి సంగీత దర్శకుడిగా పనిచేసిన మణిశర్మ, ఎన్నో హిట్ సాంగ్స్ ను అందించారు. ముఖ్యంగా మహేశ్ బాబు 'పోకిరి' .. 'అర్జున్' .. 'అతడు' .. 'ఒక్కడు' .. 'ఖలేజా' .. 'మురారి' వంటి సినిమాలకు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి మణిశర్మ తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేశ్ బాబు ప్రస్తావన తీసుకొచ్చారు.

"మహేశ్ బాబు కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన సినిమాలకి వర్క్ చేస్తూ వచ్చాను. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ అనుకోకుండా ఎక్కడో చిన్న డిస్టర్ బెన్స్ వచ్చింది. బహుశా ఆయన మనసు నొచ్చుకునేలా నేను మాట్లాడి ఉంటా. విషయమేమిటో తెలుసుకుందామంటే కుదరలేదు .. ఆ తరువాత మేము ఎక్కడా కలుసుకోలేదు. పెద్ద హీరోలకి నేను చేసిన చివరి సినిమాల్లో 'ఖలేజా'తో పాటు 'శక్తి' .. 'తీన్ మార్' వున్నాయి. నేను బెస్ట్ మ్యూజిక్ ను ఇచ్చిన సినిమాల్లో ఇవి కూడా వున్నాయి. కానీ ఆ తరువాత వాళ్లెవరూ నా వంక చూడటం లేదు .. నా తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.   
manisharma
Mahesh Babu

More Telugu News