ఆ అమెరికా దంపతులు నాకు కూడా ఫోన్ చేశారు: యాంకర్ అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ అమెరికా దంపతులు నాకు కూడా ఫోన్ చేశారు: యాంకర్ అనసూయ

  • శ్రీరాజ్ అనే వ్యక్తి అమెరికా నెంబర్ తో నాకు ఫోన్ చేశారు
  • ఓ కార్యక్రమంలో పాల్గొనమని కోరారు
  • అతను మాట్లాడే విధానం నాకు నచ్చక పోవడంతో తిరస్కరించా
అమెరికాలో టాలీవుడ్ మహిళానటులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై కిషన్ మోదుగమూడి అలియాస్ శ్రీరాజ్, అతని భార్య చంద్రలను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చికాగో సెక్స్ రాకెట్ లో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ స్పందించింది.

తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలంటూ శ్రీరాజ్ అనే వ్యక్తి అమెరికా నెంబర్ తో తనకు ఫోన్ చేసిన విషయాన్ని అనసూయ గుర్తు చేసుకుంది. అతను మాట్లాడే విధానం తనకు నచ్చకపోవడంతో తిరస్కరించానని, అయినప్పటికీ వారు ప్రచురించిన పోస్టర్ లో తన ఫొటోను ముద్రించిన విషయాన్ని ప్రస్తావించింది. ఆ ఈవెంట్ లో తాను పాల్గొనడం లేదని అప్పట్లో తన ట్విట్టర్ ఖాతా ద్వారా తాను స్పష్టం చేశానని చెప్పింది. చాలా రోజులుగా తాను అమెరికా వెళ్లలేదని చెప్పిన అనసూయ, 2014,  2016లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి ఈవెంట్లకు హాజరైనట్టు తెలిపింది.
Twitter
anasuya

More Telugu News