సొంత ఇంటికే కన్నం వేసిన కోడలు.. గుంటూరు జిల్లాలో భారీ దోపిడీ వెనక ఉన్నది కోడలే.. తేల్చేసిన పోలీసులు!

16-06-2018 Sat 06:54 | Andhra
  • టీవీ సీరియళ్ల ప్రభావంతో దోపిడీకి స్కెచ్
  • బంధువులతో కలిసి సొంత ఇంట్లో భారీ దోపిడీ ప్లాన్
  • అబద్ధాలతో పట్టుబడిన కోడలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరులోని ఓ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అత్తా కోడళ్లను కట్టేసి భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని పట్టపగలే దొంగలు దోచుకెళ్లారు. థ్రిల్లర్ సినిమాను తలపించేలా జరిగిన ఈ దోపిడీని సవాలుగా తీసుకున్న పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ మొత్తం వ్యవహారం వెనక కోడలు స్కెచ్ ఉందని నిర్ధారణకు వచ్చారు. టీవీ సీరియళ్ల ప్రభావంతోనే దోపిడీకి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు.

ఉదయం 11 గంటల సమయంలో దర్జాగా ఇంట్లోకి వచ్చి అంత మొత్తం నగదు, బంగారాన్ని దోచుకెళ్లడం అన్నది కాకలుతీరిన దోపిడీ దొంగలు తప్ప మరెవరూ చేయలేరని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపారు. దోపిడీ జరిగిన తీరును పరిశీలించి నివ్వెరపోయారు. స్వయంగా కోడలే ఇంటి దొంగ అని తేల్చారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.

గుంటూరు ఎస్పీ విజయరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పెనుమాకకు చెందిన మేకా వేమారెడ్డి-కమల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బ్రహ్మారెడ్డి భార్య శివపార్వతితో కలిసి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం వేమారెడ్డి తనకున్న పొలాన్ని విక్రయించగా రూ.2 కోట్లకుపైగా వచ్చింది. ఆ సొమ్ముతో కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం దేవేంద్రపాడులో రెండున్నర ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. అడ్వాన్సుగా రూ.40 లక్షలు ఇచ్చారు. మరో రెండుమూడు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ఉండడంతో మిగతా సొమ్ము రూ.1.60 కోట్లను ఇంట్లోనే దాచిపెట్టారు.
 
డబ్బులు ఇంట్లోనే దాచిన విషయాన్ని చూసిన కోడలు శివపార్వతి ఆ విషయాన్ని తన అక్క లక్ష్మీప్రసన్నకు, వరుసకు కొడుకయ్యే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంగా సీతారామిరెడ్డికి చెప్పింది. ముగ్గురూ కలిసి ఆ సొమ్మును కొట్టేయాలని ప్లాన్ వేశారు. వీరికి సీతారామిరెడ్డి తండ్రి వెంకటరెడ్డి తోడయ్యారు. తన స్నేహితుడైన చింతల చెరువు రాజుని సంప్రదించాడు. అతడికి హెడ్‌కానిస్టేబుల్ చెంబేటి శ్రీనివాసరావు కుమారుడు మల్లికార్జునరావుతో పరిచయం ఉంది. అతడు తోట గోపీచంద్, సాయిలు అనే మరో ఇద్దరిని ఈ పథకంలోకి తీసుకొచ్చాడు.

మొత్తం 8 మంది కలిసి పక్కాగా ప్రణాళిక రచించారు. సొమ్మును తీసుకొచ్చి ఇచ్చే పనిని మల్లికార్జునరావుకు అప్పగిస్తూ ఇందుకు రూ.20 లక్షలు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. శివపార్వతి ఎప్పటికప్పుడు ఇస్తున్న సమాచారంతో దోపిడీ కోసం అనువైన సమయం కోసం ఎదురుచూస్తుండగా గురువారం ముహూర్తం కుదిరింది.

గురువారం ఉదయం రిజిస్ట్రేషన్ పనిపై వేమారెడ్డి, బ్రహ్మారెడ్డి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన శివపార్వతి విషయాన్ని సీతారామిరెడ్డికి తెలియజేసింది. రెండు బైక్‌లపై నలుగురు, కారులో సీతారామిరెడ్డి బయలుదేరి వేమారెడ్డి ఇంటికి చేరుకున్నారు. మల్లికార్జునరావు, గోపీచంద్, సాయి, వేమారెడ్డి ఇంట్లోకి ప్రవేశించి అత్త కమలను తాళ్లతో బంధించారు. పక్కనే ఉన్న శివపార్వతి వచ్చి కనుసైగలతో బీరువాలో ఉన్న డబ్బును చూపించింది. దీంతో కమల వద్ద ఉన్న తాళాలను తీసుకుని బీరువాలో రూ.55.20 లక్షలు ఉన్న బ్యాగ్‌ను తీసుకుని వెళ్లిపోయారు.

వారు అటువెళ్లిపోగానే, పక్క గదిలోనే ఉన్న మరో బీరువాను తెరిచిన శివపార్వతి అందులోని సామాన్లను చిందరవందర చేసి విసిరేసింది. పెన్నుతో చేతిపై గీసుకుంది. పోలీసులు వచ్చినప్పుడు దొంగలు తనను కొట్టి 300 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్టు చెప్పింది. అయితే, ఆమె తన వద్ద బంగారాన్ని గతంలోనే గుంటూరులో తాకట్టు పెట్టినట్టు తేలడంతో పోలీసులు అనుమానించారు.

శివపార్వతి తీరుపై అనుమానంతో కాల్‌డేటాను పరీక్షించగా గుట్టు రట్టు అయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా శివపార్వతి నిజం కక్కింది.  సీతారామిరెడ్డి స్నేహితుడు చింతలచెరువు రాజు ఇంట్లో దాచిన దోపిడీ సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మల్లికార్జునరావుకు రూ.12.5 లక్షలు, గోపీచంద్‌కు రూ.2 లక్షలు, సాయికి రూ.2.80 లక్షలు  ఇచ్చినట్టు గుర్తించారు.
Guntur DistrictAndhra PradeshRobbery

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more