లఘు చిత్రాల సంగీత దర్శకుడు అనురాగ్ ఆత్మహత్య
- పలు షార్ట్ ఫిలింలకు పని చేసిన అనురాగ్
- టాలీవుడ్ లోకి ఎంట్రీ కోసం ప్రయత్నాలు
- వారం క్రితమే ఆత్మహత్య... ఆలస్యంగా వెలుగులోకి
పలు షార్ట్ ఫిలింస్ కు అనురాగ్ పని చేశాడు. ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఈ ఘటన జరగడం అందరినీ కలచివేస్తోంది. అతని కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.