చాంతాడంత క్యూలో ఇక నిలబడక్కర్లేదు... సాధారణ రైల్వే టికెట్లూ ఇక ఫోన్లలోనే!
- కొత్త యాప్ విడుదల
- యూటీఎస్ ఆన్ మొబైల్ పేరిట అందుబాటులోకి
- సాధారణ టికెట్ల రద్దు సౌకర్యం కూడా
ఏదైనా టికెట్ ను రద్దు చేసుకుంటే, వాలెట్ లోకి జమ అవుతాయి. తొలుత పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు సమర్పించాలని, ఆపై రైల్వే వాలెట్ '0' నిల్వతో ప్రారంభమవుతుందని, ఏదైనా యూటీఎస్ కౌంటర్ లేదా రైల్వే వెబ్ సైట్ ద్వారా దీనిలో నగదు నింపుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దీని ద్వారా కొనుగోలు చేసే టికెట్ ను ప్రింటవుట్ తీసుకోవాల్సిన అవసరం లేదని, యాప్ లోకి వచ్చిన టికెట్ ను టీసీలు అడిగినప్పుడు చూపిస్తే సరిపోతుందని తెలిపారు.