రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం వెంటనే చెల్లించాలి: టీడీపీ ఎంపీ సీఎం రమేష్

పోలవరం నిర్మాణానికి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చిందన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ చాప్టర్ క్లోజ్ అయిందని... దీంతో, ఉనికిని కాపాడుకోవడం కోసం కన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కూడా కేంద్రం ఇంత వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును వెంటనే కేంద్రం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టిని సారించారని తెలిపారు. ఏపీకి మేలు చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని దుయ్యబట్టారు.
Go Back to Shorts
CM Ramesh
kanna lakshminarayana
polavaram

More Telugu News