'చెడు వినవద్దు, అనవద్దు, కనవద్దు'.. తన కూతురు, కుమారుడితో ర‌వితేజ‌ ఫొటో వైరల్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'చెడు వినవద్దు, అనవద్దు, కనవద్దు'.. తన కూతురు, కుమారుడితో ర‌వితేజ‌ ఫొటో వైరల్‌

  • శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ కొత్త సినిమా
  • ప్రస్తుతం థాయిలాండ్‌లో మాస్‌ మహారాజా
  • కూతురు, కొడుకుతో ఫొటోలు
మాస్‌ మహారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' అనే టైటిల్‌ ఖరారు చేసిన ఆ సినిమాలో రవితేజ సరసన ఇలియానా నటిస్తోంది. కాగా, ర‌వితేజ తన ఫ్యామిలీతో క‌లిసి థాయ్‌లాండ్ వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ తన కూతురు, కొడుకుతో తీసుకున్న ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

'మూడు కోతులు'లా రవితేజ తన పిల్లలతో దిగిన ఫొటో అలరిస్తోంది. తన కూతురు చెవులు మూసుకోగా, రవితేజ నోటిపై చేతులు పెట్టుకున్నాడు.. ఇక ఆయన కుమారుడు కళ్లు మూసుకున్నాడు. 'చెడు వినవద్దు, అనవద్దు, కనవద్దు' అనేలా పోజులిచ్చి రవితేజ తీసుకున్న ఫొటో అలరిస్తోంది.

  అలాగే, మరికొన్ని ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.  
Raviteja
Twitter

More Telugu News