గడ్డం, మీసాలతో మరింత స్పష్టంగా... మహేశ్‌ బాబు కొత్త ఫొటోలు వైరల్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గడ్డం, మీసాలతో మరింత స్పష్టంగా... మహేశ్‌ బాబు కొత్త ఫొటోలు వైరల్‌!

  • మూవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ 25 ఏళ్ల వేడుకలో మహేశ్‌
  • గడ్డం, మీసాలతో అలరిస్తోన్న ఫొటోలు
  • తదుపరి సినిమాలో ఇదే లుక్‌తో మహేశ్‌?
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల మహేశ్ బాబు గెడ్డంతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొత్త సినిమాలో మహేశ్‌ బాబు లుక్‌ ఇలాగే ఉంటుందని అనుకున్నారు. అయితే, వాటిల్లో మహేశ్‌ ముఖం స్పష్టంగా కనపడలేదు.

ఈరోజు తెలుగు మూవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ 25 ఏళ్ల వేడుక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో గడ్డం, మీసాలతో మహేశ్‌ బాబు స్పష్టంగా కనపడుతూ అలరిస్తున్నారు.                                                                                                             
Mahesh Babu
Tollywood
Twitter

More Telugu News