హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం... క్రీడాకారులు 33 శాతం సంపాదనను స్పోర్ట్స్ కౌన్సిల్ కి చెల్లించాల్సిందే!
- రాష్ట్ర క్రీడల శాఖ ఆదేశాలు
- ప్రొఫెషనల్ స్పోర్ట్స్, వాణిజ్య ప్రకటనల ఆదాయంలో ఒక వంతు చెల్లించాలని నిర్దేశం
- దీనిపై క్రీడాకారుల నుంచి అభ్యంతరం
ఈ నిర్ణయం చాలా మంది క్రీడాకారులను రాష్ట్రం వీడేలా చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిని హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణి గీత ఫోగట్ తప్పుబట్టారు. భారీగా ఆర్జించే క్రికెటర్లకు ఈ నిబంధన అమలు చేస్తే అర్థం చేసుకోవచ్చు గానీ, కబడ్డి, బాక్సింగ్, రెజ్లింగ్ వంటి క్రీడాకారులను కూడా చెల్లించమంటే అర్థం లేదని, ఇది వారిని నిరాశపరిచేదేనని, 33 శాతం చెల్లించిన తర్వాత వారి వద్ద ఇంక ఏం మిగులుతుందని ఆమె ప్రశ్నించారు.