బన్నీని మెప్పించలేకపోయిన విక్రమ్ కుమార్!
Add ap7am to your home Screen

బన్నీని మెప్పించలేకపోయిన విక్రమ్ కుమార్!

  • చిరూతో మూవీ కోసం కొరటాల కసరత్తు 
  • మహేశ్ కోసం కథ రెడీ చేస్తోన్న సుకుమార్ 
  • విక్రమ్ కుమార్ ను నమ్ముకున్న బన్నీ
అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. అయితే ఈసారి అనుకోకుండా దర్శకులంతా వేరే హీరోల ప్రాజెక్టులతో బిజీ కావడం ఆయనను ఇబ్బంది పెట్టేస్తోంది. 'నా పేరు సూర్య' తరువాత ఆయన కొరటాల శివతో గానీ .. సుకుమార్ తో గాని చేయాలనుకున్నాడు. చిరంజీవితో సినిమా చేయడానికి కొరటాల రెడీ అవుతూ వుంటే, మహేశ్ తో చేయడానికి సుకుమార్ సిద్ధమవుతున్నాడు.

దాంతో ఇక విక్రమ్ కుమార్ తో చేయాలనే నిర్ణయానికి బన్నీ వచ్చేశాడు. అయితే తాజాగా తాను తయారుచేసుకొచ్చిన కథను బన్నీకి విక్రమ్ కుమార్ వినిపించాడట. ఫస్టాఫ్ బాగానే వున్నా సెకండాఫ్ విషయంలో బన్నీ అసంతృప్తిని వ్యక్తం చేశాడని అంటున్నారు. బన్నీకి సంతృప్తిని కలిగించే విధంగా కథలో మార్పులు .. చేర్పులు చేసే పనిలో విక్రమ్ కుమార్ వున్నాడట. ఈ లోగా యంగ్ డైరెక్టర్ల దగ్గరున్న కథలను కూడా వినాలనే నిర్ణయానికి బన్నీ వచ్చాడని చెప్పుకుంటున్నారు.  
Allu Arjun
vikram kumar

More Telugu News