హే సమంత.. నీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా!: రామ్ చరణ్ భార్య ఉపాసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హే సమంత.. నీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా!: రామ్ చరణ్ భార్య ఉపాసన

  • సమంత  చేసిన ఫిట్ నెస్ ఛాలెంజ్ కు స్పందించిన ఉపాసన
  • జిమ్ లో కసరత్తులు చేసిన చెర్రీ భార్య
  • ఓ వీడియో పోస్ట్ చేసిన వైనం
‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరిట కొత్త విధానానికి కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.  సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఫిట్ నెస్ వీడియోలను పోస్ట్ చేయాలంటూ పలువురు ప్రముఖులకు ఆయన సవాల్ విసరడం విదితమే. ‘ఫిట్ నెస్ ఛాలెంజ్’ లో భాగంగా ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు తమ వీడియోలను పంచుకుని, మరికొందరిని ఈ ఛాలెంజ్ లోకి ఆహ్వానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాగచైతన్య సవాల్ ను స్వీకరించిన సమంత, జిమ్ లో వ్యాయామం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ను ఈ ఛాలెంజ్ లోకి ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన ఉపాసన .. జిమ్ లో కసరత్తు చేస్తున్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘హే సమంత.. నేను విహారయాత్రలో ఉన్నప్పటికీ నీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నా. నమ్రతా శిరోద్కర్, తరుణ్ తహిలియానీ, కనికా కపూర్, పింకీ రెడ్డి & అపోలో లైఫ్ స్టూడియోలోని ట్రైనర్స్ కు నేను ఛాలెంజ్ విసురుతున్నా’ అని ఈ ఛాలెంజ్ లోకి వారిని ఉపాసన ఆహ్వానించారు.
Ramcharan
samantha
upasana

More Telugu News