చడీచప్పుడూ లేకుండా వచ్చి.. ఆర్థిక సాయం చేసి వెళ్లిపోయిన సినీ హీరో విజయ్‌!
Add ap7am to your home Screen

చడీచప్పుడూ లేకుండా వచ్చి.. ఆర్థిక సాయం చేసి వెళ్లిపోయిన సినీ హీరో విజయ్‌!

  • అర్ధరాత్రి వచ్చి ఆశ్చర్యపర్చిన హీరో
  • తూత్తుకుడి బాధితులకి అండగా ఉంటానని హామీ
  • సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసిన స్థానికులు
ఆవగింజంత సాయం చేసి గుమ్మడి కాయంత ప్రచారం చేసుకునే ఈరోజుల్లో, తమిళ హీరో విజయ్‌ తాను చేసిన సాయం ఇతరులెవ్వరికీ తెలియకుండా ఉండేలా ప్రయత్నించారు. ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సినీనటుడు విజ‌య్ గత అర్ధ‌రాత్రి తూత్తుకుడిలోని బాధితుల వద్దకు బైక్ పై వెళ్లి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం చేసి, వారికి అండగా ఉంటానని చెప్పి వెళ్లిపోయాడు. విజయ్‌ అక్కడకు వచ్చిన సందర్భంగా కొందరు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు తీశారు.  
vijay
Tamilnadu
help

More Telugu News