రీ కన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వండి: వైసీపీ ఎంపీలతో స్పీకర్

  • భావోద్వేగాలతోనే రాజీనామా చేసి ఉంటారు
  • వైకాపా ఎంపీలతో సుమిత్రా మహాజన్
  • అటువంటిదేమీ లేదని చెప్పిన ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ ఉదయం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరిన వేళ, ఆమె రీ కన్ఫర్మేషన్ లేఖలను ఇవ్వాలని కోరారు.

"భావోద్వేగాలతోనే మీరు రాజీనామాలు చేసి ఉంటారని భావిస్తున్నా" అన్న సుమిత్ర వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు, తామేమీ తొందరపడి రాజీనామాల నిర్ణయం తీసుకోలేదని, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. దీంతో లిఖితపూర్వకంగా అదే విషయాన్ని తనకు తెలియజేయాలని ఆమె చెప్పడంతో, మరికాసేపట్లో రీకన్ఫర్మేషన్ లేఖలను ఇవ్వనున్నామని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మీడియాకు తెలిపారు. కాగా, వైసీపీ ఎంపీల రాజీనామాలను సుమిత్రా మహాజన్ ఆమోదిస్తారని సమాచారం అందుతోంది.
Go Back to Shorts
YSRCP
Resignations
MPS
Sumitra Mahazan

More Telugu News