మెగాహీరో మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగాహీరో మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్?

  • షూటింగు దశలో సంకల్ప్ రెడ్డి మూవీ 
  • వ్యోమగామిగా వరుణ్ తేజ్ 
  • ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ   
'ఘాజీ' సినిమాతో సంకల్ప్ రెడ్డి మంచి సత్తా వున్న దర్శకుడు అనిపించుకున్నాడు. తక్కువ బడ్జెట్ లోనే భారీ మూవీ చేశాడు అనే ప్రశంసలు కొట్టేశాడు. ఆయనే ఇప్పుడు వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ 'వ్యోమగామి'గా కనిపించనున్నాడు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.

ప్రత్యేకమైన శిక్షణ తీసుకుని మరీ ఈ సినిమా షూటింగులో వరుణ్ తేజ్ పాల్గొంటున్నాడు. ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ ను పరిశీలించిన టీమ్ .. 'అంతరిక్షం' అనే టైటిల్ వైపు మొగ్గుచూపిందట. దాంతో నిర్మాతలు 'అంతరిక్షం' అనే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి .. అదితీరావు నటిస్తున్నారు. ఇప్పటికే 'ఫిదా' .. 'తొలిప్రేమ' సినిమాలతో సక్సెస్ ను అందుకున్న వరుణ్ తేజ్, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.       
varun tej
lavanya tripathi

More Telugu News