తమిళ అమ్మాయినైనా తెలుగులోనే మంచి గుర్తింపు వచ్చింది: నటి సుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ అమ్మాయినైనా తెలుగులోనే మంచి గుర్తింపు వచ్చింది: నటి సుధ

  • మాది తమిళనాడులోని శ్రీరంగం  
  • అక్కడ మంచి గుర్తింపు రాలేదు
  • తెలుగులో నా మొదటి సినిమా 'తల్లిదండ్రులు'  
తెలుగు తెరపై అమ్మ .. అక్క .. వదిన పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో సుధ ముందు వరుసలో కనిపిస్తుంది. అలాంటి సుధ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "మా అమ్మా నాన్నలు తమిళనాడు 'శ్రీరంగం' ప్రాంతానికి చెందినవారు. నేను తమిళ అమ్మాయినే .. నటిగా అక్కడ అంతగా గుర్తింపు రాలేదు.

తెలుగులో బాలకృష్ణ హీరోగా చేసిన 'తల్లిదండ్రులు' సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నేను చేసిన వదిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. 'గ్యాంగ్ లీడర్' లో వేసిన విడో పాత్ర తరువాత వైట్ శారీ కట్టుకుని ఎప్పుడూ ఏడుస్తూ కూర్చునే పాత్రలే వచ్చాయి. ఈ ముద్ర నుంచి బయటపడటం ఎలాగా అని ఆలోచిస్తోన్న సమయంలోనే, ఈవీవీ సత్యనారాయణగారు 'ఆమె' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. నటిగా నాకు ఆ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది' అని చెప్పుకొచ్చారు.    
sudha
ali

More Telugu News