తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెకు సైరన్!

  • ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మె
  • ఈనెల 7న ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనలు
  • 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక దీక్షలు
ఈనెల 11 నుంచి తాము నిరవధిక సమ్మెకు దిగుతున్నామని తెలంగాణలోని ఆర్టీసీ సంఘాలు స్పష్టం చేశాయి. అలాగే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నాయి. ఆర్టీసీ సంఘాలు కొంత కాలంగా వేతన సవరణ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమైన టీఎస్ ఆర్టీసీ సంఘాల కేంద్ర కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుని ఈ విషయాన్ని ప్రకటించింది.

యూనియన్ లీడర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7న ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తామని, 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు. 
Go Back to Shorts
Telangana
rtc
strike

More Telugu News