Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పూజాహెగ్డే షాపింగ్ ఏం చేస్తుందో తెలుసా?
  • వెంకీ, త్రివిక్రమ్ కాంబో రెడీ అవుతోంది 
  • 'టాక్సీవాలా' మరోసారి వాయిదా?
  • రీమేక్ చేయనున్న రాజ్ తరుణ్        

*  తనకి కళ్ల జోళ్ళంటే చాలా ఇష్టమని చెబుతోంది కథానాయిక పూజా హెగ్డే. 'నాకు కూలింగ్ గ్లాసెస్ అంటే మహా ఇష్టం. అందుకే ఎక్కడికైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు షాపింగ్ చేస్తే కనుక ముందుగా మంచి గ్లాసెస్ ఏమున్నాయో చూస్తాను. నచ్చితే వెంటనే కొనేస్తాను. ఆ విధంగా షాపింగ్ చేసిన గ్లాసెస్ నా దగ్గర చాలా వున్నాయి' అని చెప్పింది పూజ.
*  వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తొలిసారిగా తెరపైకి రానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'అరవింద సమేత..' చిత్రాన్ని చేస్తున్న త్రివిక్రమ్ ఆ తర్వాత వచ్చే జనవరి నుంచి వెంకీతో చిత్రాన్ని చేస్తాడట.  
*  విజయ్ దేవరకొండ నటిస్తున్న 'టాక్సీవాలా' చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గత నెలలో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఇప్పటికే ఈ నెలకు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ మరికొంత కాలం వాయిదా పడచ్చని అంటున్నారు. సినిమాకు మరిన్ని మెరుగులు దిద్దవలసి రావడం వల్ల ఆలస్యం అవుతోందట.  
*  తాజాగా 'రాజుగాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు. 'నానున్ రౌడీ దాన్' చిత్రం తెలుగు రీమేక్ లో రాజ్ తరుణ్ నటిస్తాడు.
Pooja
Venkatesh
vijay

More Telugu News