హీరోయిన్‌కు నేనేమీ తక్కువ కాదు: హాట్‌ యాంకర్‌ అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్‌కు నేనేమీ తక్కువ కాదు: హాట్‌ యాంకర్‌ అనసూయ

  • ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళా హీరోయినే
  • ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి
  • ఎక్కడికెళ్లినా రంగమ్మత్త అని పిలుస్తున్నారు
  • చాలా ఆనందంగా ఉంది
హీరోయిన్‌కు తానేమీ తక్కువ కాదని.. అసలు ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళా హీరోయినే అని హాట్ యాంకర్‌ అనసూయ వ్యాఖ్యానించింది. తాజాగా ఆమె విశాఖపట్నంలో ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించి మీడియాతో ముచ్చటించింది. ప్రస్తుతం తన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. రంగస్థలంలో రంగమ్మత్తలా మంచి పాత్రల్లో కనబడుతూ గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని చెప్పింది.

తాను ఎక్కడికి వెళ్లినా రంగమ్మత్త అని పిలుస్తున్నారని, చాలా ఆనందంగా ఉందని అనసూయ తెలిపింది. కాగా, జబర్దస్త్‌ వంటి టీవీ కార్యక్రమాల్లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. పలు సినిమాల్లోనూ నటించిన విషయం తెలిసిందే. రంగస్థలంలో రంగమ్మత పాత్ర వేసిన తరువాత ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.  
anasuya
anchor
Vizag

More Telugu News