డబ్బు సంపాదించాలన్న ఆశతో యువతిని చెడు మార్గం వైపు దింపిన యువకుడు.. ఆదిలోనే అడ్డుకున్న పోలీసులు!
- లక్షలు సంపాదించాలన్న కోరిక
- యువతికి నెలకు రూ. 50 వేలు ఇస్తానని ఎర
- విషయం తెలిసి అరెస్ట్ చేసిన పోలీసులు
ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో, ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న ఒంగోలుకు చెందిన యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆమెకూ వేతనం తక్కువన్న అసంతృప్తి ఉందని గమనించాడు. తాను చెప్పిన పని చేస్తే నెలకు రూ. 50 వేలు ఇస్తానని చెప్పి వ్యభిచారం చేసేందుకు ఆమెను ఒప్పించాడు. ఇద్దరూ కలసి బంజారాహిల్స్ రోడ్డు నం. 12లో ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకున్నారు. ఆ యువతి ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టి, విటులను ఆకర్షించే ప్రయత్నం చేశాడు రెహ్మాన్. ఆన్ లైన్ కంటెంట్ పై నిత్యమూ నిఘా ఉంచే పోలీసులకు ఈ విషయంపై ఉప్పందింది. దీంతో ఆ అపార్టుమెంట్ పై దాడి చేసిన పోలీసులు రెహ్మాన్ ను, యువతిని అరెస్ట్ చేశారు.