డబ్బు సంపాదించాలన్న ఆశతో యువతిని చెడు మార్గం వైపు దింపిన యువకుడు.. ఆదిలోనే అడ్డుకున్న పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డబ్బు సంపాదించాలన్న ఆశతో యువతిని చెడు మార్గం వైపు దింపిన యువకుడు.. ఆదిలోనే అడ్డుకున్న పోలీసులు!

  • లక్షలు సంపాదించాలన్న కోరిక
  • యువతికి నెలకు రూ. 50 వేలు ఇస్తానని ఎర
  • విషయం తెలిసి అరెస్ట్ చేసిన పోలీసులు
ఎంత చదివినా సరైన జీతం రావడం లేదన్న బాధతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న ఓ యువకుడిని ఆదిలోనే పట్టేశారు హైదరాబాద్ పోలీసులు. బంజారాహిల్స్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, నెల్లూరు, దర్గామిట్ట ప్రాంతానికి చెందిన షేక్‌ రహ్మాన్‌ (22) ఇంజినీరింగ్‌ చేసి రూ. 25 వేల జీతానికి ఉద్యోగం చేస్తున్నాడు. ఇది తనకు చాలా తక్కువని, లక్షలు సంపాదించాలని కలలు కంటుండేవాడు.

ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో, ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న ఒంగోలుకు చెందిన యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆమెకూ వేతనం తక్కువన్న అసంతృప్తి ఉందని గమనించాడు. తాను చెప్పిన పని చేస్తే నెలకు రూ. 50 వేలు ఇస్తానని చెప్పి వ్యభిచారం చేసేందుకు ఆమెను ఒప్పించాడు. ఇద్దరూ కలసి బంజారాహిల్స్‌ రోడ్డు నం. 12లో ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకున్నారు. ఆ యువతి ఫొటోలను ఆన్‌ లైన్‌ లో పెట్టి, విటులను ఆకర్షించే ప్రయత్నం చేశాడు రెహ్మాన్. ఆన్ లైన్ కంటెంట్ పై నిత్యమూ నిఘా ఉంచే పోలీసులకు ఈ విషయంపై ఉప్పందింది. దీంతో ఆ అపార్టుమెంట్ పై దాడి చేసిన పోలీసులు రెహ్మాన్ ను, యువతిని అరెస్ట్ చేశారు.
Hyderabad
Police
Prostitution
Arrest

More Telugu News