ఓ పెద్ద అడుగు వేయాలంటే రెండు అడుగులు వెనక్కు వేయాలి: రాజ్‌నాథ్‌ సింగ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ పెద్ద అడుగు వేయాలంటే రెండు అడుగులు వెనక్కు వేయాలి: రాజ్‌నాథ్‌ సింగ్‌

  • యూపీలోని కైరానా లోక్ సభ స్థానంలో ఓటమి 
  • ఓటమిపై స్పందించిన హోమ్ మంత్రి
  • భవిష్యత్తులో తాము పెద్ద విజయం సాధిస్తామన్న రాజ్‌నాథ్‌
ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా, మహారాష్ట్రలోని భండారా-గోండియా, పాల్‌ఘర్‌, నాగాలాండ్‌ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ రెండింట్లో ఓడిపోయింది. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో బీజేపీ గెలవగా, నాగాలాండ్‌లో బీజేపీ మిత్రపక్షం ఎన్‌డీపీపీ విజయం సాధించింది.

రెండు స్థానాల్లో ఓటమిపై స్పందించిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ... ఓ పెద్ద అడుగు వేయాలంటే రెండు అడుగులు వెనక్కు వేయాలని, భవిష్యత్తులో తాము భారీ విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, ఎన్డీఏ సర్కారుపై ఉన్న అసంతృప్తి బీజేపీ ఓటమితో బయటపడిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.      
BJP
elections
loksabha

More Telugu News