మహేశ్ నుంచి 'అర్జున్ రెడ్డి' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ .. కథానాయికగా కాజల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ నుంచి 'అర్జున్ రెడ్డి' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ .. కథానాయికగా కాజల్!

  • మహేశ్ 25వ మూవీ వంశీ పైడిపల్లితో 
  • నెక్స్ట్ సినిమా సుకుమార్ తో 
  • ఆ తరువాతనే సందీప్ రెడ్డి ప్రాజెక్ట్  
'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా, ఆ తరువాత మహేశ్ బాబుతో ఎక్కువగా కనిపించాడు. దీంతో ఆయన మహేశ్ బాబు కోసం కథ రెడీ చేస్తున్నాడనే టాక్ ఆ సమయంలో వినిపించింది. ఈ ప్రాజెక్టు ఖాయమైందనేది తాజా సమాచారం. మహేశ్ కి లైన్ చెప్పి ఓకే చేయించుకున్న సందీప్, రీసెంట్ గా పూర్తికథను వినిపించాడట.మహేశ్ తో పాటు నమ్రత కూడా కథ విని .. చాలా బాగుందని చెప్పినట్టు సమాచారం. ఇంతవరకూ మహేశ్ చేయని పాత్ర కావడం వలన .. కథ కొత్తగా ఉండటం వలన మహేశ్ బాబు దంపతులు ఓకే చెప్పారని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ అయితే బాగుటుందని కూడా ఒక మాట అనేసుకున్నారట. గతంలో మహేశ్ .. కాజల్  'బిజినెస్ మేన్' .. 'బ్రహ్మోత్సవం' సినిమాలకి కలిసి పనిచేశారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే మహేశ్ బాబుతో కలిసి కాజల్ మరోమారు సందడి చేయనుందన్న మాట. వంశీ పైడిపల్లి .. సుకుమార్ సినిమాలు పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.   
Mahesh Babu
kajal

More Telugu News