మరో బయోపిక్: వెండితెరకు విజయ్ మాల్యా కథ
- బాలీవుడ్ లో తెరకెక్కుతున్న విజయ్ మాల్యా బయోపిక్
- మాల్యా పాత్రను పోషిస్తున్న గోవింద
- గోవింద గెటప్ చూసి సర్ ప్రైజ్ అవుతారన్న పహ్లాజ్ నిహ్లానీ
ఈ సినిమాలో విజయ్ మాల్యా పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద పోషిస్తున్నాడని నిహ్లానీ తెలిపారు. మాల్యా పాత్రలో గోవింద గెటప్ చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారని చెప్పారు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై ఓ పాటను గత వారమే షూట్ చేశారు. ఈ సందర్భంగా నిహ్లానీ మాట్లాడుతూ, గతంలో కంటే గోవింద ఇప్పుడు ఫిట్ గా ఉన్నారని కితాబిచ్చారు. బ్యాంక్ స్కాం సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించామని చెప్పారు.