సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఒత్తిడిని మాయం చేసే కీర్తి సురేశ్!
  • మహేశ్-సుకుమార్ ల క్రైం థ్రిల్లర్ 
  • భాగ్యనగరంలో ఫిలిం ఫేర్ అవార్డుల సందడి 
  • లండన్ లో సూర్య షూటింగ్ 
 *  ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి తనకుందని అంటోంది కథానాయిక కీర్తి సురేశ్. "ఒత్తిడిని ఎదుర్కునే పధ్ధతి నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. కాబట్టి ఇప్పుడు సినిమాల్లో కూడా దానినే పాటిస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి నైనా తట్టుకుని, కూల్ గా ఉండగలను. అందుకే, కెమేరా ముందుకు వెళ్లానంటే అన్నీ మరచిపోతాను" అని చెప్పింది.
*  ఇటీవల 'రంగస్థలం' చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతుందని తెలుస్తోంది.
*  సినిమా అవార్డులలో ఫిలిం ఫేర్ అవార్డులకు ఓ ప్రత్యేకత వుంది. దశాబ్దాలుగా క్రమం తప్పకుండా ఇస్తున్న ఈ అవార్డుల కోసం సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో దక్షిణాది చిత్రాలకు సంబంధించి ఈ ఏడాది ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని జూన్ 16న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు.
*  సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందే చిత్రం షూటింగును వచ్చే నెలాఖరు నుంచి లండన్ లో నిర్వహిస్తారు. ఇందులో మోహన్ లాల్, అల్లు శిరీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Keerti
Mahesh Babu
surya

More Telugu News