సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కాజల్ 'ఐస్ క్రీమ్' పిచ్చి
  • ద్విపాత్రాభినయం చేయనున్న రవితేజ
  • ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు కమల్ చిత్రం 
  • 'గీతాంజలి' దర్శకుడి మరో చిత్రం 
*  'ఐస్ క్రీమ్ చూస్తే మాత్రం నా నోరు ఆగదు..' అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'ఐస్ క్రీమ్స్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అందుకే మా ఇంట్లో ఎప్పుడూ రకరకాల ఐస్ క్రీమ్స్ వుంటాయి. నేను వాటిని బాగా లాగిస్తాను. అలా తిన్నప్పుడు జిమ్ లో కాసేపు ఎక్కువగా వర్కౌట్స్ చేస్తా. దాంతో అవి నా ఫిట్ నెస్ మీద ప్రభావం చూపవు' అని చెప్పింది.
*  ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్న హీరో రవితేజ, ఆ తర్వాత నటించే చిత్రంలో డ్యూయల్ రోల్ చేయనున్నట్టు సమాచారం. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడట.
*  ప్రముఖ నటుడు కమలహాసన్ తాను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'విశ్వరూపం 2' చిత్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఆగస్టు రెండో వారంలో విడుదల చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు.
*  గతంలో 'గీతాంజలి' వంటి థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించి సక్సెస్ పొందిన దర్శకుడు రాజ్ కిరణ్, కొంత కాలం గ్యాప్ తర్వాత త్వరలో మరో చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది కూడా థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతుందని సమాచారం. 
Kajal Agarwal
Raviteja
Kamal Haasan

More Telugu News