మమ్మల్ని అయితే అందరూ అడుగుతారు కానీ.. భారత్‌ను ఒక్కసారైనా అడిగారా?: ముషారఫ్ అక్కసు
- అణ్వాయుధాల విషయంలో పక్షపాతం
- పాక్‌ను అడిగేవారు భారత్‌ను పల్లెత్తు మాటనడం లేదు
- మోదీ శాంతి చర్చల వ్యతిరేకి
భారత్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉందన్న ముషారఫ్.. తామెప్పుడూ అమెరికాకు విశ్వాసపాత్రంగా ఉన్నట్టు చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య సయోధ్య ఉండేదని, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ శాంతి చర్చలకు అనుకూలం కాదని ముషారఫ్ ఆరోపించారు.