చిరుత పులితో ఫైటింగ్ చేసి.. కూతురిని రక్షించుకున్న తల్లి!
- తమిళనాడులోని కోయంబత్తూర్లో ఘటన
- ఇంటి వెనక కట్టెలు సేకరిస్తోన్న ముత్తులక్ష్మి
- కూతురిపై చిరుత దాడి
తన కూతురు సత్యతో కలిసి తమ ఇంటి వెనక కట్టెలు సేకరిస్తోన్న ముత్తులక్ష్మి అనే మహిళకు ఓ చిరుత కనపడింది. అది ఒక్కసారిగా తన కూతురిపై దాడికి దిగడంతో ముత్తులక్ష్మి ఓ కట్టెతో దాడి చేస్తూ పోరాడింది. దీంతో ఆ చిన్నారిని వదిలిన చిరుత పులి అక్కడి నుంచి పారిపోయింది.
ఈ ఘటనలో ఆ చిన్నారి మెడపైన తీవ్ర గాయాలు కావడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ ప్రాంతంలో చిరుతలు పదే పదే తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.