మూలిగే నక్కపై తాటి పండు అంటే ఇదే..
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూలిగే నక్కపై తాటి పండు అంటే ఇదే..

కర్ణాటక ఎన్నికల్లో ఓటరు తీర్పుకు కుదేలైన బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మూలిగే నక్కపై తాటిపండులా.. ఇప్పటికే ఓటమి భారంతో కుంగిపోయిన బీజేపీ తాజాగా ప్రతిపక్ష హోదాను సైతం చేజార్చుకుంది. ఎన్నికల్లో బీజేపీకి 40, జేడీ(ఎస్)కు 40 సీట్లు వచ్చినా ఓటింగ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో బీజేపీకి నిరాశ తప్పలేదు. నిన్నటి సాయంత్రం వరకు కర్ణాటక విధానసభ ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందన్న విషయం అందరిలోనూ ఉత్కంఠ రేపింది. అయితే, ఇలాంటి అరుదైన పరిస్థితుల్లో రెండు పార్టీలకు పోలైన ఓట్లను లెక్కించి ఎవరికి ఎక్కువ వచ్చాయో వారికి ప్రతిపక్ష హోదా అప్పగిస్తారు.

More Telugu News