Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్రేమసాగరం' హిట్ తరువాత స్కూల్ కి వెళ్లాను .. టీసీ ఇచ్చి పంపించారు: సీనియర్ హీరోయిన్ నళిని

  • 8th క్లాస్ లో ఉండగా 'ప్రేమసాగరం' చేశాను 
  • నన్ను చూడటానికి బాయ్స్ వచ్చారు 
  • మా ప్రిన్సిపాల్ మేడం కంగారు పడిపోయింది
అప్పట్లో 'ప్రేమసాగరం' సినిమా నళిని కెరియర్ ను ఒక రేంజ్ లో పరుగులు తీయించింది. ఆ సినిమా తరువాత జరిగిన సంఘటనలను గురించి, 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. " 'ప్రేమసాగరం' సినిమా చేసేటప్పటికీ నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత నేను స్కూల్ కి వెళ్లాను.

ఆ పక్కనే బాయ్స్ హై స్కూల్ ఉండేది. వాళ్లంతా కూడా నన్ను చూడటం కోసం గేట్ తోసేసుకుంటూ పొలోమంటూ మా స్కూల్లోకి వచ్చేశారు. దాంతో మా ప్రిన్సిపాల్ మేడం బాగా టెన్షన్ పడింది. అంతకుముందు నా హ్యాండ్ రైటింగ్ బాగోలేదని కొట్టిన ప్రిన్సిపాల్ మేడమ్ కూడా నా ఆటో గ్రాఫ్ తీసుకున్నారు. అప్పటికే ఆమె ఆ సినిమాను రెండు మూడుసార్లు చూశారట. ఇక నువ్ చదువుకోవడం కుదరదు .. యాక్టింగ్ వైపే వెళ్లు అని చెప్పేసి .. అప్పుడే టీసీ రాసి ఇచ్చేశారు" అంటూ చెప్పుకొచ్చారు.    
nalini

More Telugu News