ఆసక్తిని రేకెత్తించే రెండు షేడ్స్ లో కనిపించనున్న ఎన్టీఆర్
Add ap7am to your home Screen

ఆసక్తిని రేకెత్తించే రెండు షేడ్స్ లో కనిపించనున్న ఎన్టీఆర్

  • షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ  
  • డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ 
  • ఆయన సరసన నాయికగా పూజా హెగ్డే
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగును ఆరంభించిన ఈ సినిమాకి, 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ముందుగా ఈ సినిమాకి 'రాఘవ' అనే టైటిల్ నే పెడదామని అనుకున్నారట. అయితే 'అ' అక్షరంతో టైటిల్ మొదలుకావాలనే త్రివిక్రమ్ సెంటిమెంట్ కారణంగా, ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించనుండటం విశేషం. అయితే ఇది ఆయన పాత్రలోని ఒక షేడ్ అని చెబుతున్నారు. సినిమా ఫస్టాఫ్ లో ఎన్టీఆర్ కుటుంబ బంధాలకి విలువనిచ్చే సాఫ్ట్ కేరక్టర్ లో కనిపిస్తాడట. అయితే ఆయన ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఆసక్తిని రేకెత్తించే యాక్షన్ తో కూడినదిగా ఉంటుందని అంటున్నారు. డిఫరెంట్ షేడ్స్ లో ఎన్టీఆర్ దుమ్మురేపేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఆయన జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.     
ntr
pooja hegde

More Telugu News