తెరపై నాతో జోడీ కట్టడానికి హీరోయిన్స్ పోటీపడేవారు: చంద్రమోహన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెరపై నాతో జోడీ కట్టడానికి హీరోయిన్స్ పోటీపడేవారు: చంద్రమోహన్

  • నా సరసన చాలామంది హీరోయిన్స్ చేశారు 
  • నాతో కలిసి నటిస్తే స్టార్ డమ్ వచ్చేసేది 
  • జయసుధతో 25 సినిమాలు చేశాను  
తెలుగు తెరపై ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్, మరో వైపున కృష్ణ .. శోభన్ బాబుల హవా కొనసాగుతూ ఉండగానే చంద్రమోహన్ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండగా, '' మీ సరసన ఏ హీరోయిన్ చేసినా ఆ తరువాత టాప్ పొజీషన్ కి వెళుతుందని అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? అనే ప్రశ్న ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ .. " ఇది కాకతాళీయమే అయినా అప్పట్లో ఈ సెంటిమెంట్ బాగా బలపడిపోయింది. నా సినిమాతోనే అరంగేట్రం చేస్తామని భానుప్రియ .. శాంతిప్రియ పట్టుబట్టారు. రాధిక.. విజయశాంతి .. సులక్షణ .. శ్రీదేవి .. జయసుధ .. జయప్రద అంతా కూడా నా సరసన నటిస్తే టాప్ పొజీషన్ కి వెళ్లిపోతామని భావించేవారు .. నిజంగానే తరువాత సినిమాకి వాళ్లు నాకు అందనంత స్థాయికి వెళ్లిపోయేవాళ్లు. ఆ సెంటిమెంట్ కారణంగా మాధవి .. రాధిక .. విజయశాంతి నాతో ఏడెనిమిది సినిమాలు చేశారు. ఒక్క జయసుధతో మాత్రం 25 సినిమాల వరకూ చేశాను " అని చెప్పుకొచ్చారు. 
chandramohan
jayasudha

More Telugu News