టీవీ నటి అంజలిపై కిడ్నాప్ కేసులో ట్విస్ట్... పోలీసుల ముందు నూతన వధూవరులు!

  • తమ కుమార్తెను అంజలి కిడ్నాప్ చేసిందంటూ ఫిర్యాదు
  • తాము మేజర్లమేనంటూ పోలీసుల ముందుకు జంట
  • వారి ఇష్టప్రకారం వివాహం చేసుకోవచ్చన్న పోలీసులు
తన సోదరుడి కోసం టీవీ నటి అంజలి తమ కుమార్తెను కిడ్నాప్ చేసిందంటూ దివ్య అనే యువతి తల్లిదండ్రులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలో ఇది కొత్త ట్విస్ట్. పోలీసుల ముందు దివ్యతో సహా హాజరైన అంజలి, వెంకటేశ్ లు తాము మేజర్లమని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ కు అంజలితో కలసి వచ్చిన ఈ జంట, తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని రాతపూర్వకంగా రాసిచ్చారు. ఆపై పోలీసు అధికారులు మాట్లాడుతూ, నూతన వధూవరులిద్దరూ మేజర్లేనని, యుక్త వయసు వచ్చిన వారు తమ ఇష్టానుసారం ఎవరినైనా వివాహం చేసుకునే హక్కును కలిగివుంటారని, దివ్య తల్లిదండ్రులకు ఈ విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Police
Actress
Anjali

More Telugu News